View allAll Photos Tagged classical
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : KOLACHINA VAARIKI
పల్లవి : కొలచిన వారికి, కొలచిన తీరుల
కొలువని వారికి, కొలచేటి రీతుల "2"
అ.ప : నీ దివ్యకరుణల, నడయాడే
వేంకటరమణా, వేదనారాయణా "కొలచిన"
చరణం : కొండంత ఫలము, కొండంత బలము
కోనేటి రాయుడె, మా కొండంత దైవము "2"
యేడు కొండలలో, కొలువైవున్నాడు "2"
కొండల రాయుడె, మా కులదైవము
వేంకటరమణా, వేదనారాయణా "కొలచిన" "2"
చరణం : అన్నింటను, నీ అండయే వున్న
ఇలనిది లేదను, చింతయే కనము "2"
కైవల్య పదమునకు, కారణ భూతుడు "2"
మూర్తీభవించిన, కారుణ్య జలనిథి
వేంకటరమణా, వేదనారాయణా "కొలచిన" "2"
చరణం : ప్రాభాతవేళల, నీ పదాంబుజముల
సేవయె మాకు ఇహపర సౌఖ్యము "2"
కలియుగ మందున ప్రత్యక్షదైవమై "2"
వరములు కురిపించే, వరదాయకా
వేంకట రమణా, వేదనారాయణా "కొలచిన" "2"
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : NAANAATIKI
పల్లవి : నానాటికీ, ఏనాటికీ తిరమగు దైవము శ్రీధరు డొక్కడే
తిరమగు దైవము శ్రీధరు డొక్కడే "నానాటికీ"
చరణం : నాలుకల తేనెలూరు పదము పరమ పదమునకు, ఇది మార్గము
హరినామము, శ్రీహరినామము "2" ఇది నిజము, ఇక హరియే మన పధము "2"
శ్రీ హరి తప్ప, అన్య దైవమే లేడట "నానాటికీ"
చరణం : నాడును, నేడును, పుట్టుకలేని నిధియు, నిధానము, చేరువ దైవము
హరి ఒక్కడే, శ్రీ హరి ఒక్కడే "2" జగమంతయును, స్థితి లయలందునను "2"
సృష్టియె తానుగ, వెలుగును ఏనాడు "నానాటికీ"
Classical Bicycle design for Steampunk Revolution.
Production: Modeling, Shading, Lighting and Rendering.
© Nel, Dec 2009.
Photos for a magazine article of a day course in classical riding and training with Ton Duivenvoorden at the Moravita training stables in Coevoerden, the Netherlands.
My husband, Cole, writes beautiful modern classical music. His latest performance was last week. Think you all might enjoy this wonderful wintery treat here.
the man!
i love/d gregory hines (rip), and he was a really good dancer. however, even he admitted that savion was way ahead of where he was.
and goodness me!!!
he was awesome.
royce hall, ucla
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : KOMMALA ANCHUNA
పల్లవి : కొమ్మల అంచుల, మెరిసే పూతావి వలె "2"
మా కన్నుల నిండుగ వేంకటేశుడు మా ఆత్మల ఆత్మ జ్యొతి వేంకటేశుడు "కొమ్మల"
చరణం : అమ్మలాల, అల కొండ రాయుడే మా అండ, దండని, తలచేరే "2"
కొమ్మల పూవుల, ఎల్ల తావుల "2" మనసెల్ల నిండెడు, మహీధరుడు, నగధరుడు "కొమ్మల"
చరణం : ఎల్ల లోకములు యేలెడి రాయుడు ఈ నల్లని ఱేడుని, కొలువరే! "2"
చెంతన, చింతలు బాపెడి వాడట "2" సుంతైనను, మనకు చింతలు, యిక యేల! "కొమ్మల"
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla RamaRao
LYRICS : UYYAALA JAMPAALA
పల్లవి : ఉయ్యాలా! జంపాలా!
నట్టనడిమినది, సుఖఃదుఖములడోల "ఉయ్యాలా"
చరణం : పసిప్రాయమందున, ఆటపాటల జోల
యవ్వన ప్రాయమున, విద్యార్జన హేల "2"
వయసుడికిన వేళ, వేదాంత వూయల
మధ్యననున్నది, జీవనహేల "ఉయ్యాలా"
చరణం : సత్సంగ సాంగత్యం, జ్ణానమునకు వూయల
గ్రంధపఠనమే, విజ్ఞాన వూయల "2"
ఉపకారమనునది, నిస్సందేహ వూయల
అపకారికైనను, ఉపకార వూయల "ఉయ్యాలా"
చరణం : అస్సాధ్యమైనను, సాధన వూయల
అణువంతైనను, సంతృప్తి వూయల
ఇసుమంతైనను, కొండంత వూయల
గోవిందుని సేవే, ఆనంద డోలల "ఉయ్యాలా"