day2daynews9
Congress Party News: టిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం...
జీహెచ్ఎంసి ఎన్నికల తరువాత తెలంగాణలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అధికార టిఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ ను లేకుండా చేయాలని టిఆర్ఎస్, ఎంఐఎంలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా వారితో కలిసిందని జగ్గారెడ్డి విమర్శించారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ అమిత్ షాని ఎందుకు కలిశారన్నది అనుమానంగా ఉందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ లేదు, నక్సలైట్ సమస్య అసలే లేదని, అలాంటప్పుడు ఎందుకు కలిసారని ప్రశ్నించారు.
ఇక ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ కలిసిన తరువాత, బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీ ఎందుకు వెళ్లారని, కారణాలు ఏంటని ప్రశ్నించారు. బండి సంజయ్ పదేపదే కేసీఆర్ ని జైల్లో పెట్టిస్తానని చెప్పడం వెనుక అర్ధం ఏంటో చెప్పాలని అన్నారు. ఇప్పటికే దాదాపుగా 10సార్లు ఇదే విషయాన్ని చెప్పిన బండి సంజయ్, దీనిపై డెడ్ లైన్ పెట్టె దమ్ముందా అని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ అక్కడ బీజేపీ నాయకులతో విందులు వినోదాల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. బీజేపీ, టిఆర్ఎస్ మధ్య ఏం సంబంధం ఉందొ ప్రజలు గమనించాలని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారని, తెలంగాణకు ప్రధాని వస్తే నిధులు అవసరం లేదు మాది ధనిక రాష్ట్రం,ప్రధాని ప్రేమ ఉంటె చాలు అని కేసీఆర్ ప్రకటన చేసారని, ఆరోజు ప్రేమ ఉంటె చాలు అన్న కేసీఆర్, ఇప్పుడు ఢిల్లీ వెళ్లి డబ్బులు ఎందుకు అడిగారని ప్రశ్నించారు. నిధుల పేరుతో టిఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటో ఒప్పందం కుదిరిందని అన్నారు. ఈ చీకటి ఒప్పందంలో ఎంఐఎం day2daynews.in/news/congress-party-leader-jaggareddy-slam...