Back to photostream

ఎవరు చేసినా అది తప్పే... రాజాసింగ్

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఫేస్ బుక్ అకౌంట్ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ పేరు మీద కొన్ని ఫేక్ ఫేస్ బుక్ పేజీలు క్రియేట్ అయ్యాయి. చాలా మంది వాటిని అఫిషియల్ అకౌంట్స్ అనుకోని ఫాలో అవుతున్నారు. అయితే, ఈ ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్స్ పై రాజసింగ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి ఫేస్ బుక్ అకౌంట్స్ లేవని, తన అకౌంట్ 2018 లో హ్యాక్ అయ్యిందని తరువాత దానిని తాను పునరుద్దరించలేదని అన్నారు. తన అభిమానులు కానీ, కార్యకర్తలు గాని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఉంటారని, ఎవరు చేసినా తప్పు తప్పే అని వాటిని బ్యాన్ చేసినందుకు ఫేస్ బుక్ కు ధన్యవాదాలని ఎమ్మెల్యే రాజసింగ్ పేర్కొన్నారు. 2018 లో బ్లాక్ ఆయన తన అకౌంట్ ను తిరిగి పునరుద్దరించాలని, తగిన ప్రూఫ్ లు సబ్మిట్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు రాజసింగ్ పేర్కొన్నారు. తన అకౌంటు పునరుద్దరించాలని కోరుతూ ఫేస్ బుక్ కు మెయిల్ చేస్తున్నట్టు రాజసింగ్ పేర్కొన్నారు. day2daynews.in/news/bjp-mla-rajasingh-about-fake-facebook...

5 views
0 faves
0 comments
Uploaded on September 3, 2020