Bramhosthavam - Sarada Sai

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

బ్రహ్మోత్సవం

 

పల్లవి : బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం

తిరు వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవం [బ్రహ్మో]

 

చరణం : సాగరమధనమున గరళామృతము వెడల

కంఠమునందు దాచె, గరళము హరుడు [2]

కాపాడె లోకములు, ఆ సాంబశివుడె

అశృనయనమ్ములా కొనియాడె లోకములు [బ్రహ్మో]

 

చరణం : అమరులను జేసేటి, అమృతమ్మును

సురలు, అసురులూ, కోరితిరీసమముగ [2]

మూర్తులూ, మువ్వురు, పడిరి సందిగ్ధమున

యుక్తి సహితంబుగ యోచించె శ్రీహరి [బ్రహ్మో]

 

చరణం: హరిమారెను, మోహినిగ, సర్వాంగ సుందరిగ

అసుర, సురలు యిరువురు, తీరిరీ బారులుగ [2]

వలికించె మోహిని, వలపు వయ్యారములు

మునిగెను, అసురులు, మోహ సంద్రముల [బ్రహ్మో]

 

చరణం: అమృతము సురలకు, అసురులకు జలమును

పంచె మోహిని, అంత అసురులను మరిపింప

అవతరించునులె ఆ దేవదేవుండు

జగములను గాపాడ దీనబాంధవుడూ [బ్రహ్మో]

105 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020