Hari Neeve - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

LYRICS : HARI NEEVE

 

పల్లవి : హరి, నీవే, మా ఇహపర దైవము

హరియే, మాకు, కైవల్య పదము [2]

 

అ.ప : యెరుగుము, యెరుగుము, ఓ మనసా! [హరి]

 

చరణం : హరి, నీగతియే సులభ సాధ్యము [2]

హరి నీవు మాపాలి అభయ హస్తము [2]

హరి, నీ తలపే ఇల వైకుంఠము [2]

యెరుగుము, యెరుగుము, ఓ మనసా! [హరి] [2]

 

చరణం : సురనుతుడే, మాకున్న దైవము

ఆతడు, జగతికి అపూర్వ భావము

పాలించును, ఇలను పీతాంబరుడే [2]

ఎరుగుము, ఎరుగుము, ఓమనసా [హరి] [2]

 

చరణం : హరి, నీ చరణములు, భవతాపహరణం

హరి నామమే మాకు, పుణ్య శ్రవణం

పరంధాముడే, మా మూలధనము [2]

ఎరుగుము, ఎరుగుము, ఓ మనసా! [హరి] [2]

 

89 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020