Jagamerigina Vaaniki - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

జగమెరిగిన

 

పల్లవి : జగ మెరిగినవానికి, జంధ్యమెందుకు,

హరినితలచుటకు, నీకుయోచనెందుకు [2]

 

అ.ప : యోజనదూరము, నీకుయందుకని [2]

నీమానసమున నిలుపుము, ఆతనిని [జగమెరిగిన]

 

చరణం : చదువూసంపదలు, లోకములేలుటకు [2]

భక్తిసంపద, భాగవతోత్తముని కొలచుటకు [2]

అజ్ఞానతిమిరములు, పారద్రోలెడివాడు [2]

సర్వేశ్వరుడొకడే, జగమేలు వాడు [2] [జగమెరిగిన]

 

చరణం : ఘనకీర్తి కాములు, పదవులు యేలిననూ [2]

పెదవిన, శ్రీహరి పదమొకటే చాలును [2]

పదహారు కళల నాధుడు, పద్మనాభుడితడు [2]

పదాంబుజముల రజ మొకటే చాలును [2] [జగమెరిగిన]

 

96 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020