Jagamulanele Thallivi - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

LYRICS : JAGAMULANELE THALLIVI

 

పల్లవి : జగముల నేలే, తల్లివి నీవు శివ సతి, పరాశక్తివి "2"

 

చరణం : అన్నింటను, నీ అభినవ రూపము మిన్నంటిన, నీ కరుణ లాలసము

వెన్ను తట్టి, దారి చూపించు విధము సన్మార్గాన, నడిపించు ఘనము

అలరారేవు, అఖిల జగమ్ములు పలు రూపమ్ముల, ఆదిశక్తిగ

ఆయురారోగ్య, ఐశ్వర్యదాయిని అఖిల చరపు కార్య కారిణి "జగ"

 

చరణం : శంకర విరచిత సౌందర్య లహరీ జగదోద్ధారిణి, జగన్నాయకీ

శంకర ప్రియ రమణి శాంకరీ కైంకర్యముతో సేవింతుమే

విద్యా ప్రదాయిని, వాగ్దేవివి నీవు వాగ్భూషణి నీవె, వేదమయివి నీవె

వనజ భవుని ప్రియ పత్నివి వరము లిచ్చెడి వరదాయిని "జగ"

 

88 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020