Vinayaka Ma Bujji Vinayaka - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla RamaRao

 

LYRICS : VINAYAKA

 

పల్లవి : వినాయకా, మా బుజ్జి " వినాయకా"

విఘ్నాలన్ని, తొలగించే "వినాయకా"

 

అ.ప : రావా, వేగమె రావా!

మా పూజలు అందుకోవా! "వినాయకా"

 

చరణం : చిట్టి ఎలుక నీ వాహనం

నువు ముల్లొకములు చుట్టేవట "2"

సుందర రూపము, మందగమనము

మెప్పించేవట, లోకములెల్లను

సాంబశివునికి, ముద్దుబిడ్డడివి

షణ్ముఖునకు సోదరుడవంట "వినాయకా"

 

చరణం : గణములన్నిటికి, అధిపతివంట

నువు గణపతయ్యగా, నిలిచావంట "2"

నీవేనయ్యా, మా ప్రధమ నుతులలో

ఇచ్చేవంట ప్రమోదమ్ములు

విద్యా బుద్ధుల నొసగుమయ్యా!

వినయమ్ము తోడ మెలిగేమయ్యా! "వినాయకా"

99 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020