Mangalam Jaya Mangalam - Siri

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

LYRICS : MANGALAM JAYA MANGALAM

 

పల్లవి : మంగళం, జయ మంగళం మా ఉరగ శయనకు మంగళం [2]

 

అ.ప : మంగళం శుభ మంగళం శ్రీ దురిత దూరికి మంగళం [2]

 

చరణం : రక్కసులను, మట్టు గరిపెడి, నందకమునకు మంగళం

గొల్లతల్లుల, మనము లందలి, పిల్ల గ్రోవికి మంగళం

మంగళం శుభ మంగళం గోపాలబాలుకు మంగళం [మంగళం] [2]

 

చరణం : కాళీయుని దర్పమణచిన వనజ విభునకు మంగళం

ఎల్లవేళల, కన్నుకాచే కోమలాంగుకు మంగళం

మంగళం శుభ మంగళం గోవర్ధనునకూ మంగళం [మంగళం] [2]

 

చరణం : సర్వ నిలయుడు, మోహనాంగుడు పరమ యోగికి మంగళం

క్షీరమధనుని మానసమ్మున వీక్షణమునకు మంగళం [2]

మంగళం శుభ మంగళం మా పద్మనాభుకు మంగళం [మంగళం] [2]

89 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020