Dhaga Dhaga - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

LYRICS : DHAGA DHAGA

 

ఓంశంకరా! గరళ కంధరా! చంద్రశేఖరా! శివ,శివశంభో! "2"

 

పల్లవి : ధగ ధగ, ధగ ధగ ధవళ రూపమున మెరిసెను, నగమున నటరాజం

ఢమఢమ, ఢమఢమ, ఢమరుకమ్మునూ, కరమున మ్రోగెను, ఢమఢమ, ఢం "2"

కైలాసమున శివతాండవము తకధిమి, తకధిమి, కదులగ పదములు "ధగ ధగ"

ఓంశంకరా! గరళ కంధరా! చంద్రశేఖరా! శివశివశంభో "2"

 

చరణం : హరిహర రూపమె, కైలాసనాధుడు జగతికి ఆతడె, ఆధారభూతుడు "2"

స్థితి, లయములకు, మూలకారకుడు వరము లొసగుటలొ, బోళానాధుడు "2"

పరవశాన శివతాండవం ప్రమధ గణములకు పరవశం "ధగ ధగ"

 

చరణం : భవాని మోము, నిండినవి నగవులు భువనైక విభుని ఆ నాట్యలీలలు "2"

సప్త సంద్రములు, ఉప్పొంగెనులే! కాశీనాధుని తాండవ కేళికి "2"

నటరాజు ఆడె నర్తనం ముల్లోకములకు సంతతం "ధగ ధగ"

ఓం శంకరా! గరళ కంధరా! చంద్రశేఖరా! శివ శివ శంభో

91 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020