Sudarsana Chakramaa - Neeraj

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla RamaRao

 

LYRICS : SUDARSANA CHAKRAMAA

 

పల్లవి : సుదర్శన చక్రమా, శుభదర్శన చక్రమా అసుర భంజనమా, సుర పూజితమా [2]

 

చరణం : సహస్ర సూర్య కాంతులీను, హరి చక్రమా మాయా మోహములను, ఛేదించు చక్రమా [2]

శిష్టుల పాలి, శశి కాంతి చక్రమా కాలుల పాలిటి, కాల చక్రమా [సుదర్శన]

 

చరణం : అధర్మ శీలుర, అంత మొందించుటకై సహస్ర ధారల, అసాధ్య చక్రమా [2]

లోక కంటకుల, కరడు గుండెలలో కదము ద్రొక్కేటి, కరకు చక్రమా [సుదర్శన]

 

చరణం :తార తమ్యములను, తుడిచి వేయు చక్రమా తామర తూడువలె, సున్నిత చక్రమా [2]

కరుణార్ధ హృదయుల, గాపాడు చక్రమా కరుణాంత రంగుని, కరమున చక్రమా [సుదర్శన]

77 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020