Uyyaala Jampaala - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla RamaRao

 

LYRICS : UYYAALA JAMPAALA

 

పల్లవి : ఉయ్యాలా! జంపాలా!

నట్టనడిమినది, సుఖఃదుఖములడోల "ఉయ్యాలా"

 

చరణం : పసిప్రాయమందున, ఆటపాటల జోల

యవ్వన ప్రాయమున, విద్యార్జన హేల "2"

వయసుడికిన వేళ, వేదాంత వూయల

మధ్యననున్నది, జీవనహేల "ఉయ్యాలా"

 

చరణం : సత్సంగ సాంగత్యం, జ్ణానమునకు వూయల

గ్రంధపఠనమే, విజ్ఞాన వూయల "2"

ఉపకారమనునది, నిస్సందేహ వూయల

అపకారికైనను, ఉపకార వూయల "ఉయ్యాలా"

 

చరణం : అస్సాధ్యమైనను, సాధన వూయల

అణువంతైనను, సంతృప్తి వూయల

ఇసుమంతైనను, కొండంత వూయల

గోవిందుని సేవే, ఆనంద డోలల "ఉయ్యాలా"

 

78 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020