Paruguna Raare - Sarada Sai

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

LYRICS : PARUGUNA RAARE

 

పల్లవి : పరుగున రారే, ఇంతులాలా

పసి బాలుని జూడగ, ఇంతులాలా "2"

 

అ.ప : పరిచయముతోనే ఇంతులాలా "2"

పరమొసగే స్వామిని, ఇంతులాలా "పరుగున"

 

చరణం : యశోద కన్నడే, ఇంతులాలా

మనకు యశముల నిచ్చేనే, ఇంతులాలా "2"

భుజగశయనుడే, ఇంతులాలా "2"

మనల భుజములపై, మ్రోయునే ఇంతులాలా "పరుగున"

 

చరణం : శక్తి, యుక్తులను, ఇంతులాలా

శ్రమ లేక ఇచ్చునే, ఇంతులాలా "2"

శరణను వారిని, ఇంతులాలా "2"

శరవేగమున గాచును, ఇంతులాలా "పరుగున"

 

చరణం : అణువంతేనే, ఇంతులాలా

పలురూపముల, దోచునే, ఇంతులాలా "2"

పరికించి చూడంగ ఇంతులాలా "2"

బ్రహ్మండ మాతడే, ఇంతులాలా "పరుగున"

86 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020