Doaboochulaadeavura - Kanakesh Rathod & Sarada Sai

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

LYRICS : DOABUCHULADEAVURA

 

పల్లవి : దోబూచులాడేవురా, కృష్ణయ్యా "2"

బూచులు దునిమేటి అల్లరి కన్నయ్యా "దోబూచు" "2"

 

చరణం : దాచిన వెన్నను దొంగిలించి

నీ సాటి బాలురతొ భుజియించేవు "2"

బృందావనమున నీ అడుగుల సవ్వడితొ "2"

తరులు, విరులు ఆనంద నాట్యమే "దోబూచు" "2"

 

చరణం : అన్ని కాలముల, అఖిల ధర్మములు

నిలుపటకు నీవు అవతరింతువు "2"

మేటి నీవయా! నీ సాటి ఎవరయా! "2"

ఇలను మహిమలు చూపించ రావయా! "దోబూచు"

82 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020